“RRR”లో అజయ్ రోల్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్.!

“RRR”లో అజయ్ రోల్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్.!

Published on Jun 26, 2021 2:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. గత కొన్ని రోజులు కితమే మళ్ళీ షూట్ ను ప్రారంభించుకున్న ఈ చిత్రం ఈ షెడ్యూల్ తో కంప్లీట్ షూట్ ను పూర్తి చేసుకోనుంది.

మరి ఈ చిత్రంలో తారక్ చరణ్ లతో పాటుగా బాలీవుడ్ స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒకరు. మరి అజయ్ ఈ చిత్రంలో ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారో కూడా ప్రెజెంట్ చేశారు.

అయితే అసలు సినిమాలో అజయ్ రోల్ ఎలా డీల్ చేస్తారు అన్న దానిపై ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం కు తండ్రిగా కనిపించనున్నాడట. అయితే దీనిపై ఎంత వరకు నిజముందో కానీ ఆ టాక్ వైరల్ అవుతుంది. మరి ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు