ప్రభాస్ జాన్ లో పూజా అలా కనిపిస్తారట…!

ప్రభాస్ జాన్ లో పూజా అలా కనిపిస్తారట…!

Published on Sep 26, 2019 7:24 AM IST

pooja

ప్రభాస్ సాహో చిత్రం తరువాత జిల్ ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం పీరియాడిక్ మూవీ గా తెరకెక్కుతుంది. 1960 ల కాలంలో యూరప్ లో జరిగిన ఓ అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని గతంలో ప్రభాస్ చెప్పడం జరిగింది. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె పాత్ర పై ఒక ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే పూజా హెగ్డే ఈ చిత్రంలో ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుండదట. పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ ని పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు రాధా కృష్ణ. ఇప్పటికే ఆమె లుక్ పై కసరత్తు మొదలు పెట్టారట ఆయన. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో పూజా 90లనాటి కాలేజ్ గర్ల్స్ గెటప్ లో అలరించారు. మరి జాన్ చిత్రంలో మరి ఆమె ఎలా ఉంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు