యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ‘సాహో’ నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయింది. దాంతో ప్రభాస్ తన తరువాత సినిమా జాన్ పై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు రాధా కృష్ణ. ఇప్పటికే ఆమె లుక్ పై కసరత్తు మొదలు పెట్టారట ఆయన.
ఐతే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. సినిమాలో వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయట. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
