యష్ మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్!

Published on Mar 13, 2021 7:02 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు “కేజీయఫ్” ప్రాజెక్ట్స్ తో ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే. ఆ సినిమాతోనే పాన్ ఇండియన్ లెవెల్లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. మరి దీనితో తన తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఎంత మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. అలా లేటెస్ట్ గా తన 19వ ప్రాజెక్ట్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి అక్కడి స్టార్ దర్శకుడు నర్తన్ ఫిక్స్ కాగా దానికి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చే నెలలో ఉండనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ టాక్ తో పాటుగా ఈ పాన్ ఇండియన్ సినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన సమాచారం తెలుస్తుంది. మరి ఈ గాసిప్ ప్రకారం ఈ చిత్రానికి “జటాస్య” అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ టాక్ ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :