అట్లీ – షారుఖ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jun 29, 2021 10:23 pm IST


కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం పై మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తుంది.

ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఏ ఆర్ రెహమాన్ ని తీసుకుంటారని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రానికి సౌత్ నుంచి మరింత మంది సంగీత దర్శకులు ఈ చిత్రానికి పాటలు సమకూరుస్తారట. మరి అందులో రెహమాన్ కూడా ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇది వరకే షారుఖ్ తన చెన్నై ఎక్స్ ప్రెస్ తో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు ఈ కాంబోతో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :