చరణ్ సెన్సేషనల్ కాంబో బ్యాక్ డ్రాప్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jun 27, 2021 5:11 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో రౌద్రం రణం రుధిరం అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా ప్లాన్ చెయ్యడంతో దానిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

అక్కడ నుంచి ఈ సెన్సేషనల్ కాంబోలో ఎలాంటి సినిమా ఉంటుందా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా పలు బ్యాక్ డ్రాప్స్ ఈ సినిమాపై వినిపించాయి. అయితే వాటిలో మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నే ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. చరణ్ ఐ ఏ ఎస్ అధికారిగా కనిపిస్తాడో లేదో కానీ ఈ చిత్రం సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఉంటుందట.

ఇప్పుడు ఇదే టాక్ బయటకి వచ్చింది. శంకర్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నారని తనదైన మార్క్ మేకింగ్ తో మళ్ళీ వింటేజ్ శంకర్ ని చూపిస్తారని తెలుస్తుంది. అయితే శంకర్ గ్రాండ్ కం బ్యాక్ కోసం చాలా మందే ఆశిస్తున్నారు. మరి ఈ కాంబోతో అది ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :