“పుష్ప” నెక్స్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Aug 25, 2021 12:00 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక్కో అప్డేట్ తో మంచి హైప్ పెంచుకుంటూ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ వచ్చి భారీ రెస్పాన్స్ ని అందుకొని ఇప్పటికీ కూడా కొనసాగుతుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ గా ఒక డ్యూయెట్ ని రిలీజ్ చెయ్యనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. అయితే ఇంకా టైం ఎప్పుడు అన్నది తెలియరావాల్సి ఉంది. ఇప్పటికే బన్నీ, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ల ఆల్బమ్ అంటే అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. మరి వాటిని మ్యాచ్ చేసే విధంగా ఫుల్ ఆల్బమ్ వస్తుంది అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మరి అవన్నీ వినాలంటే ఇంకొంత కాలం ఎదురు చూడాలి.

సంబంధిత సమాచారం :