పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఎపిక్ సెన్సేషనల్ హిట్ చిత్రాలు బాహుబలి సిరీస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గ్లోబల్ ఆడియెన్స్ దగ్గరకి వెళ్ళడానికి గల మొదటి బిగ్ స్టెప్ ఇదే.. మరి ఇలాంటి సినిమా తోనే తమ ఫస్ట్ ఎవర్ భారీ యానిమేషన్ సినిమాని తీస్తున్నారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ గా సిద్ధం చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఈ ఉదయమే ఓ బిగ్ న్యూస్ కూడా బయటకి వచ్చింది.
దీనితో పాటుగా నిర్మాత శోభు యార్లగడ్డ పలు ఇంట్రెస్టింగ్ లీక్స్ ని అందిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో యానిమేషన్ సినిమాలకి వాటిని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఆడియెన్స్ వెనుకాడరు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఐమ్యాక్స్ వెర్షన్ లాంటిది కూడా ఉందా అనే ప్రశ్నకి తన నుంచి అవును అనే సమాధానం వచ్చింది. అంతే కాకుండా జపాన్ లో రిలీజ్ ని ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు. సో బాహుబలి యానిమేషన్ సినిమా అనుకున్న దానికంటే పెద్ద రీతిలోనే విడుదల కానుంది అని చెప్పవచ్చు.
じゃあ!!日本でも劇場で見ることができますかね!!!????(前のめり) https://t.co/ShFHbxkCW6
— nacco🇹🇼🇯🇵 (@_nacco) April 15, 2026


