నాని ద్విపాత్రాభినయంలో నటిస్తోన్న సినిమా కృష్ణార్జున యుద్ధం. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు . తాజా సమాచారం మేరకు ఈ సినిమా కిడ్నాప్ కథాంశంతో నడుస్తోందని సమాచారం. ఇద్దరు హీరోయిన్స్ ను కిడ్నాప్ చేస్తే ఇద్దరు హీరోలు వారిని ఎలా రక్షించారు అనేది సినిమాలో మెయిన్ పాయింట్ గా తెలుస్తోంది.
ఇద్దరు హీరోల పాత్రల్లో నాని డబల్ యాక్షన్ చేసారు, వీరిద్దరి లవర్స్ పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత నాని చెయ్యబోయే సినిమాకు సంభందించి చర్చలు జరుగుతున్నాయి. కృష్ణార్జున యుద్ధం సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందించగా హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు.


