ఆసక్తికరమైన సినిమాలతో వస్తున్న సీనియర్ హీరో !
Published on Apr 26, 2018 8:31 am IST

కొన్నాళ్లపాటు కెరీర్లో సరైన హిట్ లేక వెనుకబడిన సీనియర్ హీరో డా.రాజశేఖర్ ఇటీవలే ‘గరుడవేగ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమా తరవాత కొత్తదనం ఉండే కథల్ని మాత్రమే చేయాలనే జాగ్రత్తను పాటిస్తున్నారాయన. అందుకే పలు స్క్రిప్ట్స్ విని చివరగా కొన్ని ఆసక్తికరమైన కథలను ఫైనల్ చేశారట.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు రాబోతున్నాను, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాను అన్నారు. మరి ఈ సీనియర్ హీరో సైన్ చేసిన ఆ సినిమాలు ఏవి, అవి ఎవరి దర్శకత్వంలో ఉండబోతున్నాయి వంటి వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook