‘డ్యూడ్ 2’ అనౌన్సమెంట్ కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్!

‘డ్యూడ్ 2’ అనౌన్సమెంట్ కి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్!

Published on Jun 10, 2026 9:00 AM IST

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన యూత్ ఫుల్ మ్యూజిక్ డ్రామా చిత్రం ‘డ్యూడ్’ తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని ఎలాంటి పార్ట్ 2 కి లీడ్ లేకుండానే ముగించేశారు. కానీ లేటెస్ట్ గా దర్శకుడు పార్ట్ 2 ఉంది అంటూ డ్యూడ్ 2 కోసం అనౌన్స్ చేయడం మళ్ళీ సినిమా లవర్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే డ్యూడ్ 2 అనౌన్సమెంట్ కి మాత్రం అదే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ముందు సినిమానే అంత నచ్చలేదు అంటే మళ్ళీ పార్ట్ 2 ఎందుకని అంటుంటే ఇంకొంతమంది కొన్ని సినిమాలు ఒక్క పార్ట్ తోనే ఆపేస్తే బెటర్ అని ఇవన్నీ అనవసరంగా సాగదీయడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు సాయి అభ్యంకర్ ఈసారి ఎలాంటి ట్రీట్ అందిస్తాడో అని ఎగ్జైట్ అవుతున్నారు. ఇలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వైరల్ గా మారింది.

తాజా వార్తలు