‘అలిమేలు మంగ’ పై ఇంట్రస్టింగ్ రూమర్ !

‘అలిమేలు మంగ’ పై ఇంట్రస్టింగ్ రూమర్ !

Published on Apr 14, 2021 1:05 AM IST


యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి.. మళ్ళీ ముప్పై ఏళ్ల తరువాత కలిస్తే.. ఎలా ఉంటుంది ? పైగా ఇద్దరూ శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుంది ? అనే కోణంలో సినిమా నడుస్తోందట.

ఇక తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది. కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు