టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతిపెద్ద కాంబినేషన్ మహేష్-రాజమౌళి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అటు మహేష్ అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. టాప్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటికి చేసింది,ఆర్ ఆర్ ఆర్ తో కలిపి 12 చిత్రాలు మాత్రమే. వీటిలో అత్యధికంగా నాలుగు ఎన్టీఆర్ తో, మూడు ప్రభాస్ తో, రెండు రామ్ చరణ్ తోచేయగా, సునీల్,నాని, రవితేజ, నితిన్ లతో తలో ఒక మూవీ చేశారు.
కానీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్, పవన్ కళ్యాణ్ లతో ఆయన ఇంత వరకు మూవీ చేయలేదు. ఐతే ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి చేయబోయేది మహేష్ తోనే అని ఒక రూమర్ కొద్దిరోజులుగా పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అలాగే రాజమౌళి ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడని వార్త. అసలు సినిమానే అధికారికంగా ప్రకటించలేదు. అప్పుడే కథ కూడా ఇదే అంటూ వస్తున్న పుకార్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


