ఇంట్రెస్టింగ్..”యశోద” పార్ట్ 2 కూడా ఉందా.?

ఇంట్రెస్టింగ్..”యశోద” పార్ట్ 2 కూడా ఉందా.?

Published on Nov 18, 2022 12:00 PM IST

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “యశోద”. దర్శకుడు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సామ్ కెరీర్ లో ఓ సాలిడ్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉందా అనే టాక్ బయటకి రాగా లేటెస్ట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో అయితే మేకర్స్ క్రేజీ హింట్ ఇచ్చారు.

సమంతా ఒప్పుకున్నట్టయితే యశోద కి డెఫినెట్ రెండు కంటిన్యూస్ గా రెండు పార్ట్ లు ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే సమంత కోలుకున్నాక సీక్వెల్ కోసం మాట్లాడుతామని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం మంచి థ్రిల్లింగ్ హిట్ అయ్యింది. ఇక దీనికి సీక్వెల్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు