సౌత్ పరిశ్రమలో సూపర్ ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె హిందీ, తమిళ్, తెలుగులో కలిపి మొత్తం నాలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు, మోహన్ లాల్ సరసన ఒక మలయాళ చిత్రం, యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రంలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఆమె రజిని 168వ చిత్రంలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు. ఐతే రజిని మూవీలో ఆమె రోల్ ఏమిటనేది స్పష్టత ఇవ్వలేదు.
తాజాగా కోలీవుడ్ లో కీర్తి సురేష్ పాత్రపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజిని చెల్లిగా నటిస్తారట. రజిని తల్లి తండ్రులకు లేటుగా పుట్టిన చెల్లిగా కీర్తి రోల్ ఉంటుందని ఆ పుకారు సారాంశం. సూపర్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ రజిని చెల్లిగా నటిస్తుందా.. అనేది ఆసక్తిగా మారింది. అలాగే రజిని డ్యూయల్ రోల్ చేస్తుండగా ఓ పాత్రకు హీరోయిన్ గా ఆమె నటిస్తున్నారంటూ మరో వాదన కూడా నడుస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.
