డిజిటల్ టెక్నాలజీలో ఎన్టీఆర్ ని చూడబోతున్నామా ?

దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా కథను సిద్ధం చేసుకున్నాక అందులోని ఎన్టీ రామారావుగారి పాత్ర కోసం తారక్ ను సంప్రదించారు నాగ్ అశ్విన్. కానీ తారక్ మాత్రం ఆయనంతటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించే అర్హత తనకు లేదని ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు.

ఆ పాత్రలో తారక్ ను మాత్రమే ఊహించుకున్న నాగ్ అశ్విన్ ఇంకో నటుడ్ని సంప్రదించలేదు. పైగా ఎన్టీఆర్ పాత్ర విషయంలో అభిమానులు సప్రైజ్ ఫీలయ్యేలా ఒక పని చేశారట. ఇంతకీ ఆ సప్రైజ్ ఏమిటీ అంటే కథలోని ఎన్టీఆర్ పాత్ర డిజిటల్ టెక్నాలజీలో అనగా గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేయబడిందని తెలుస్తోంది. ఒకవేళ నాగ్ అశ్విన్ ఇదే గనుక చేసి ఉంటే ఆ డిజిటల్ టెక్నాలజీలో తారక్ ను చూపించారా లేకపోతే పెద్దాయన్నే చూపించారా అనేది సినిమా చూస్తే కానీ బయటపడదు.

Exit mobile version