ఆసక్తికరమైన పాత్రలో స్టార్ హీరోయిన్ !

Published on Apr 12, 2019 1:30 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం ‘చపాక్’ అనే చిత్రం లో నటిస్తుంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా ప్రధాన పాత్రలో నటిస్తుంది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఈ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా లుక్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. ఈ మేకప్ కోసం దీపికా రోజుకు ఎనిమిది గంటల సమయం కేటాయిస్తుందట.

ఇక 15 సంవత్సరాల వయసులో లక్ష్మి అగర్వాల్ 2005 లో యాసిడ్ దాడికి గురైయింది. ఆ తరువాత 7 సర్జరీ లు చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆసిడ్ సేల్స్ ను బ్యాన్ చేయాలని పోరాడుతుంది.

సంబంధిత సమాచారం :