మెగా హీరో కథ మూడు జ‌న‌రేష‌న్‌ల మధ్య నడుస్తుందట

Published on Jun 26, 2019 6:59 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాను లాంచ్ చేశాడు. ఈ చిత్రానికి ‘ప్రతిరోజు పండగే’ అనే టైటిల్ నిర్ణయించారు. మారుతి అన్ని సినిమాలో మాదిరిగానే ఇందులో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అంటుందట. అయితే ఈసారి మారుతి గత సినిమాల్లో మాదిరి హీరోకు మతిమరుపు, అతి శుభ్రత లాంటి వెరైటీ లోపం ఉందట. ఫన్ మొత్తం హీరో కుటుంబం మీదనే నడుస్తుందట.

అది కూడా తాత, తండ్రి, మనవడు అంటూ మూడు తరాల మధ్య జరుగుతుందని తెలుస్తోంది. వీరిలో మనవడు తేజ్ కాగా తండ్రిగా రావు రమేష్, తాతగా సత్యరాజ్ నటిస్తారట. చిత్రం పూర్తిగా పల్లెటూరి నేపథ్యం కలిగి ఉంటుందని కూడా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More