‘విరాటపర్వం’ టీజర్ : విప్లవం, ప్రేమల సమ్మేళనం

Virata Parvam

రానా దగ్గుబాటి చేస్తున్న కొత్త సినిమాల్లో ‘విరాటపర్వం’ కూడ ఒకటి. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. కొద్దిసేపటి క్రితమే సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ స్టన్నింగ్ అనొచ్చు. ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా, రైతుల కోసం పోరాడే నక్సలైట్ అరణ్య పాత్రలో రానా, అతను రాసే విప్లవ కవితలను వింటూ, చదువుతూ అతన్నే ప్రాణంగా ప్రేమించే యువతి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా కనిపించారు.

టీజర్ ఎక్కువ భాగం సాయి పల్లవి ప్రేమ కోణంలోనే ప్రెజెంట్ చేశారు. టీజర్ చూస్తే ఒక పోరాటాన్ని, ప్రేమను మిళితం చేసిన కథ ఇదని ఇట్టే అర్థమవుతోంది. ఇందులో కనబడిన కొన్ని షాట్స్ చూస్తే సినిమా మీద ఉన్నపళంగా ఆసక్తి క్రియేట్ అవ్వక మానదు. ప్రేమించినవాడిని వెతుక్కుంటూ కథానాయిక అడవుల్లోకి వెళ్లడం, పోలీసుల చేతుల్లో ఇబ్బందులు పడటం, ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టడం లాంటి అంశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇవి చాలు ప్రేక్షకుడ్ని సినిమాకు హుక్ చేయడానికి. టీజర్లో ఏ కంటెంట్ అయితే చూపించారో సినిమా మొత్తంలో అలాంటి కంటెంటే గనుక ఉంటే సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడం ఖాయం. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version