విజయ్ “లియో” పై ఇంట్రెస్టింగ్ థియరీలు.!

Published on Feb 4, 2023 1:05 pm IST

లేటెస్ట్ గా మన సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ని సెట్ చేసిన చిత్రం “లియో”. ఇళయ దళపతి విజయ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు. మరి నిన్ననే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టైటిల్ వీడియో ని మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా టైటిల్ పెట్టిన తర్వాత ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎలా లింకప్ అయ్యి ఉంటుంది అనే అంశాలు మూవీ లవర్స్ లో ఆసక్తిగా మారాయి. అయితే ఈ సినిమాలో విజయ్ రోల్ ని ఓ బేకరి లో చూపించగా దానిని ఖైదీ లో కార్తీ రోల్ కి లింకప్ చేస్తూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

అలాగే మరోపక్క ఈ తరహా మాఫియా చిత్రాల్లో కొన్ని కోడ్స్ ఉంటాయి అని అదే విధంగా విక్రమ్ లో రోలెక్స్ కి చూపించిన తేలు గుర్తు ఇప్పుడు లియో గా పిలిచే పేర్లు ఉంటాయని అన్నిటిలో లియో అందరికి బాస్ లా ఉంటాడు అన్నట్టుగా రకరకాల ఇంట్రెస్టింగ్ థియరీ లు ఇపుడు వస్తున్నాయి. అయితే లోకేష్ మాత్రం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడు అనేది అతనికే తెలుసు.

సంబంధిత సమాచారం :