కమల్ సినిమాకు అనుకుంటున్న సాలిడ్ టైటిల్ ఇదేనట ?

కమల్ సినిమాకు అనుకుంటున్న సాలిడ్ టైటిల్ ఇదేనట ?

Published on Oct 6, 2020 8:59 PM IST

Kamal Haasan
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ తన తర్వాతి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. కానగరాజ్ తయారుచేసుకునే కథలన్నీ వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన చేసిన ‘ఖైదీ, మానగరం’ చిత్రాలే అందుకు నిదర్శనం. ఆయన మేకింగ్ కూడ రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ క్వాలిటీస్ నచ్చే కమల్ హాసన్ ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

‘వన్స్ అపాన్ ఏ టైమ్ థెర్ లివ్డ్ ఏ ఘోస్ట్’ క్యాప్షన్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక ప్రాజెక్ట్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ చిత్రం కోసం సాలిడ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటి అనుకుంటున్నారా.. ‘గురు’. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇకపోతే ఇందులో మరొక స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారనే ప్రచారం కూడ జరుగుతోంది. కమల్ సొంత బ్యానర్లో నిర్మితంకానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. నవంబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

తాజా వార్తలు