‘డిస్కో రాజా’గా రానున్న మాస్ రాజా ?

‘డిస్కో రాజా’గా రానున్న మాస్ రాజా ?

Published on Jun 26, 2018 2:16 PM IST

raviteja

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు మాస్ రాజా రవితేజ. ఈ ఏడాది ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకు ఈ రెండు సినిమాలు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చాయి. అయితే ఈ చిత్ర పరాజయాల నుండి తొందరగానే తేరుకొని ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించననున్నాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో’ అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసి తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘తేరి’ రీమేక్ లో నటించనున్నాడు.

ఈ సినిమాల తరువాత ఆయన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫెమ్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి’ డిస్కో రాజా’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు చిత్ర వర్గాల నుండి సమాచారం అందుతుంది. రవితేజ రెండు పాత్రల్లో నటించనున్న ఈ సినిమా పూర్తిగా ఆయన శైలికి తగ్గట్లు ఎంటెర్టైనింగా తెరకెక్కనుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు