వరుణ్ తేజ్ సినిమా ‘అంతరిక్షం’ !

వరుణ్ తేజ్ సినిమా ‘అంతరిక్షం’ !

Published on Jun 5, 2018 4:48 PM IST

వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి పెద్ద ప్రయోగమే చేస్తున్నారు. ‘ఘాజి’ సినిమాతో సక్సెస్ అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రం అంతరిక్షం నేపథ్యంలో ఉండనుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని కొంత చిత్రీకరణ కూడ జరుపుకుంది సినిమా.

ఈ చిత్ర్రానికి ‘అంతరిక్షం’ అనే ఆసక్తి టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగులో రూపొందుతున్న మొట్ట మొదటి స్పెస్ థ్రిల్లర్ కావడంతో పేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి ఉంది. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు