విజయ్ దేవరకొండ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ !
Published on Mar 8, 2018 5:29 pm IST


యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమిల్ దర్శకుడు ఆనంద్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనున్న ఈ సినిమాకు ‘నోటా’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను నిర్ణయించారు. ఎన్నికల పరిభాషలో నోటా అంటే ఇవిఎంలో సూచించబడిన అభ్యర్థులెవర్నీ నేను ఎన్నుకోవడంలేదంటూ ఓటర్ తన అభిప్రాయాన్ని తెలపడం.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ పై కె.ఈ. జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్నారు. మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి సామ్ సిఎస్ సంగీతాన్ని అందించనున్నారు. ఇకపోతే విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్వకత్వంలో చేస్తున్న సినిమా చివరి దశకు చేరుకుంది.

 
Like us on Facebook