‘మెగాస్టార్ – బాబీ’ సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Mar 29, 2021 3:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఇంతకీ ఏమిటి ఆ టైటిల్ అంటే ఈ చిత్రానికి ‘వీరయ్య’ అనే టైటిల్ పెడుతున్నారట. టైటిల్ పాతగా ఉన్నా.. కథకు బాగా సూట్ అవుతుందని.. అందుకే మెగాస్టార్ సినిమా అయినా ఇలాంటి టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. చిరుకు అన్ని వర్గాల్లోనూ అభిమానులున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడ ఎక్కువే. గతంలో ఆయన చేసిన కుటుంబ కథా చిత్రాలు మంచి విజయాలను సాదించాయి. మరి బాబీ సినిమా కూడ ఆ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :