ఇంట్రస్టింగ్ టైటిల్ తో క్రేజీ కాంబినేషన్ !

Published on Mar 1, 2021 12:04 pm IST

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో నటుడు సుధీర్‌బాబు ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సమ్మోహనం, వీ చిత్రాలు తరువాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. అయితే ఈ రోజు సినిమా టైటిల్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు. అయితే ఈ టైటిల్ గురించి మాకు అందిన సమాచారం ప్రకారం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అనే టైటిల్ లాక్ చేశారు. టైటిల్ వెరీ ఇంట్రస్టింగా ఉంది.

అన్నట్టు ఈ సినిమాలో సుధీర్‌కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది. కాగా సుదీర్‌ 14గా రూపొందుతున్న ఈసినిమా పై అప్పుడే పాజిటివ్ ఫీడ్ బ్యాగ్ ఉంది. మరి సుధీర్ ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అంటూ ఎలాంటి ప్రేమ కథ చెబుతాడో చూడాలి. ఇక వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. పీవీ వింద్యా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :