శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. ఇంట్రెస్టింగ్

Published on Jun 28, 2021 6:50 pm IST

హీరో శర్వానంద్ సైన్ చేసిన సినిమాల్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కూడ ఉంది. ఈ చిత్రాన్ని శ్రీకార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారు. 2019 ఆగష్టు నెలలో ఈ చిత్రం మొదలైంది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో గతేడాది వేసవిలోనే రిలీజ్ కావాల్సింది నిలిచిపోయింది. 2020లో కాస్త చిత్రీకరణ జరిపి మిగిలిన భాగాన్ని ఇటీవలే ముగించారు. ఈ చిత్రంలో శర్వానంద్ జోడీగా రీతు వర్మ నటిస్తోంది. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ కొద్దిసేపటి క్రితమే రివీల్ చేశారు టీమ్.

సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే ఆహ్లాదకరమైన టైటిల్ పెట్టడం జరిగింది. ఒక పూర్తి జీవితాన్ని ప్రతిభింబించేలా అన్ని రకాల అంశాలు అంశాలతో పోస్టర్ డిజైన్ చేశారు. శర్వానంద్ భుజానికి గిటార్ తగిలించుకోవడం చూస్తే సినిమాలో శర్వానంద్ మ్యూజిషియన్ పాత్రలోనో లేకపోతే సంగీత ప్రియుడిగానో కనిపిస్తాడని అనిపిస్తోంది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై యస్‌.ఆర్‌. ప్రభు, యస్‌.ఆర్‌ ప్రకాశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :