ఇంట్రస్టింగ్ టైటిల్ తో సెన్సేష‌న‌ల్ స్టార్ !

Published on Sep 17, 2019 11:00 am IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ చిత్ర టైటిల్ ను ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రకటించనున్నామని చిత్రబృందం నిన్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అని టైటిల్ పెట్టారు. ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయం సాధించలేకపోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More