మెగాస్టార్ ‘సైరా’లో అల్లు అర్జున్ ?

మెగాస్టార్ ‘సైరా’లో అల్లు అర్జున్ ?

Published on Aug 9, 2018 4:12 PM IST

sye raa 11

మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి , రవికిషన్, సుధీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే మెగా డాటర్ కొణిదల నిహారిక కూడా సైరా చిత్రంలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు. కాకపొతే ఆమె నిడివి రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు అల్లు అర్జున్ ది కూడా అంతే నిడివి గల పాత్ర అని తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు