దర్శకుడు చెైతన్య దర్శకత్వంలో ‘నారా రోహిత్’ హీరోగా 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కాగా ఎప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలని కోరుకున్నే ‘నారా రోహిత్’, పాత్ర బాగుంటే కథానాయకుడిగానే కాకుండా ప్రధానమైన పాత్రలను కూడా పోషిస్తారు. అప్పట్లో ఒకడుండే వాడు చిత్రంలో ఆయన అలాగే నటించారు.
అయితే ప్రస్తుతం అలాంటి పాత్రలోనే నారా రోహిత్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రంలో తాను ఓ హీరోగా కాకుండా, చిత్రంలోని ఓ కీలకమైన పాత్రగా కనిపించనున్నాడట. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. నారా రోహిత్ తన కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని అందుకే తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని అంతే స్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు కూడా ప్యాడింగే ఉండే అవకాశం ఉంది. ఎలాగైనా ఈ సినిమా పై క్రేజ్ తీసుకురావాలని నారా రోహిత్ ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి డిజైన్ చేయనున్నారు. అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.


