‘తేజ్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త !

Published on Aug 12, 2018 3:01 pm IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఐతే వారి పేర్లే చిత్ర మరియు లహరి అట. అందుకే ఈ చిత్రానికి హీరోయిన్లు పేర్లు బేస్ చేసుకొని చిత్రలహరి అని పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఒక హీరోయిన్ గా నివేదా థామస్‌ నటిస్తుండగా మరో హీరోయిన్‌ ను వెతికే పనిలో ఉంది చిత్రబృందం. ఓ భిన్నమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More