సిల్లీ ఫెలోస్ పూర్తి హాస్యభరితం అట !
Published on Aug 13, 2018 5:18 pm IST

వరుస విజయాల నుంచి వరస పరాజయాలతో అల్లరి నరేష్ గత కొంతకాలంగా సతమతవుతున్నాడు. కాగా తాజాగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పై నరేష్ మరియు సునీల్ చాలానే హోప్స్ పెట్టుకున్నారు. అయితే తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నారట.

ఐతే జంధ్యాల గారి పాత చిత్రానికి ఈ చిత్రం ప్రేరణ అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా పూజా ఝావేరి నటిస్తోంది. పూజా గతంలో విజయ్ దేవరకొండ సరసన ద్వారకా చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook