ఈ స్టార్ డైరెక్టర్ మెస్ లో పనిచేసేటప్పుడు వాళ్లు ర్యాష్‌గా బిహేవ్ చేశారట !

Published on Jul 29, 2018 9:22 am IST

స్టార్స్‌ కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేసిన ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ తనయుడు రాహుల్ విజ‌య్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ కాగా ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఘనంగా ఆడియోను లాంచ్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఆడియోను లాంచ్ కు హాజరైన పూరీ జగన్నాథ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ లోని కృష్ణానగర్‎లో చౌదరి మెస్ అని ఉండేదట. ఆ మెస్ ఓనర్ ఇంట్లోనే పూరి ఉండేవారని, ఆ కారణంగా ఖాళీగా ఉన్న సమయంలో పూరీ జగన్నాథ్ మెస్‎లో భోజనాల వడ్డించే వాణ్ణి అని చెప్పుకొచ్చారు.

కాగా ఆ మెస్ కు ఫైట్ మాస్టర్ రాజు, అతని అసిస్టెంట్లందరూ వచ్చేవారట. అందరూ ర్యాష్‌గా బిహేవ్ చేస్తే, ఒకే ఒక వ్యక్తి నవ్వుతూ పలకరించే వారని, ఆయనే ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అని పూరి చెప్పుకొచ్చారు. అలా పరిచయమైన ఈ ఇద్దరూ సూపర్ హిట్ సినిమాలకి కలిసి పని చెయ్యడం విశేషమే. ఇక ఈ చిత్రంలో రాహుల్ సరసన కావ్యా థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు రాము కొప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :