అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Oct 6, 2019 3:46 pm IST

స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్దం. అనుష్క మూగదైన పెయింటింగ్ ఆర్టిస్టుగా నటిస్తుండగా ఓ వైవిధ్యమైన కథతో కళాత్మ చిత్రంగా తెరకెక్కుతోందని సమాచారం. కాగా రేపు నిశ్శబ్దం చిత్రం నుండి మాధవన్ పాత్రను, మరియు అతని లుక్ ని పరిచయం చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వైలిన్ వాయిస్తున్నట్లు గా ఉన్న మాధవన్ సగం ఫొటోతో ఉన్న ఆ పోస్టర్ చూస్తుంటే ఆయన వైలిన్ కళాకారుడిగా కనిపిస్తారేమో అని తోస్తుంది.

అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసన్ ఓ పాత్ర చేయడం విశేషం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More