విక్టరి వెంకేటేష్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం వెంకీ మామ. వీరిద్దరూ మామ అల్లుళ్లు గా నటిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు, వివేక్ కూచిబొట్ల, విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది .
వెంకటేష్ రైతుగా, చైతు జవాన్ గా కనిపిస్తారని సమాచారం. ఐతే ఈ మూవీ విడుదల తేదీ విషయమై కొద్దిరోజులుగా సందిగ్దత కొనసాగుతుంది. షూటింగ్ పూర్తయి ఇన్ని రోజులవుతున్నా నిర్మాతలు విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఐతే నేడు దీపావళిని పురస్కరించుకొని ఏదో కొత్త విషయాన్ని పంచుకుంటారట. నేడు వెంకీ మామ చిత్ర యూనిట్ సాయంత్రం 4 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఇది విడుదల తేదీ గురించో లేక టీజర్ గురించో చూడాలి. ఇప్పటివరకు ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో ఓ ప్రమో వీడియో విడుదల చేయడం జరిగింది.


