‘ఎఫ్ 3’లో తెలుగు హీరోయిన్ !

Published on Apr 13, 2021 8:15 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొట్టేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ప్రస్తుతం వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మూడో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ కోసం మొదట సోనాలీ చౌహాన్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో అంజలిని తీసుకున్నారట.

మొత్తానికి అంజలి సెకెండ్ ఇన్నింగ్స్ వకీల్ సాబ్ తో స్టార్ట్ అయినట్లుంది. కాగా ఆ మధ్య ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట.

సంబంధిత సమాచారం :