టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొట్టేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ప్రస్తుతం వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా నిన్న వెంకటేష్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు.
కాగా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో రవితేజ నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసేశాడు. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత చేయడానికి వరుణ్, వెంకీల నుండి రాబోతున్న సినిమా ‘ఎఫ్ 3’నే.


