‘ఎవడు’ కాంబినేషన్ రిపీట్ అయ్యేలానే ఉందిగా ?

Ramcharan Vamshi m

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన డేట్లు ను కేటాయించనున్నాడు. ఐతే చరణ్ ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా సోషల్ మీడియాలో గతంలోనే అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అందులో కాస్త నమ్మదగేలా అనిపించింది మాత్రం, డైరెక్టర్ వంశి పైడిపల్లితో రామ్ చరణ్ తన తర్వాత సినిమా చేయబోతున్నాడనే విషయం.

అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ‘ఎవడు’ కాంబినేషన్ రిపీట్ కాబోతుందనే తెలుస్తోంది. ఎవడు చిత్రానికి స్క్రీన్ ప్లే సహాకారం అందిచింన హరి అనే ఓ కొత్త రైటర్ చెప్పిన పాయింట్ ఇటు రామ్ చరణ్ కి, అటు వంశీ పైడిపల్లికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద వర్క్ కూడా జరుగుతుందట. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయిన తరువాత వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలవ్వవొచ్చని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version