‘సీటీమార్‌’లో ఇంట్రస్టింగ్ లవ్ ట్రాక్ !

‘సీటీమార్‌’లో ఇంట్రస్టింగ్ లవ్ ట్రాక్ !

Published on May 24, 2020 10:55 PM IST

సంపత్‌ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా రాబోతున్న స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా ‘సీటీమార్‌’. గోపీచంద్ ఈ సినిమాలో ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నాడు. తమన్నా జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్ గా చేస్తున్నారు. ఆమ్ రోల్ కూడా ఈ చిత్రంలో సీరియస్ నెస్ తో కూడుకున్న ఇంటెన్సిటీతో ఉంటుందట. అయితే తమన్నా – గోపీచంద్ మధ్య గేమ్ కి సంబంధించి మంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తోందని, ఈ మధ్యలోనే వీరి లవ్ ట్రాక్ కూడా చాల ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు