‘రాకింగ్ స్టార్’ తరువాత ‘సంజయ్ దతే’నట !

Published on Mar 22, 2020 10:01 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ సినిమా. కాగా ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ప్రశాంత్ నీల్ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడని అర్థమైంది. ఇక సంజయ్ దత్ ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆయన పై తెరకెక్కించిన సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ తరువాత సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడని తెలుస్తోంది.

హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ అయితే ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ సీక్వెల్ లో తొలి భాగాన్ని మించి భారీ యాక్ష‌న్ ని చూపించ‌నున్నారు.

ఇక కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

సంబంధిత సమాచారం :