మెగాస్టార్ ‘వేదాళం’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Jan 18, 2021 1:58 pm IST

మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజాగా లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్ లో నడుస్తోందట. నేపథ్యానికి కథకు మధ్య ప్రత్యేక లింక్ ఉంటుందట. కలకత్తా నేపథ్యాన్ని కథలో యాడ్ చేస్తున్నారట. ఇక 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం మెహర్ ఈ చిత్రానికి లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ లో కీలక ఎపిసోడ్స్ లోని లొకేషన్స్ లోనే తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అలాగే ఈ చిత్రంలో చిరు సోదరి రోల్ కు సాయి పల్లవిని ఎంపిక చేశారన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం కలదట. లేని పక్షంలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట.

సంబంధిత సమాచారం :