‘ఎన్టీఆర్’ సరసన టాలెంటెడ్ హీరోయిన్ ?

Published on Nov 1, 2020 1:14 am IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ విదేశీ భామను ఫైనల్ చేసిన రాజమౌళి.. మరో హీరోయిన్ పాత్ర కోసం సౌత్ ఇండియా బ్యూటీనే ఫైనల్ చేశాడట. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుందట.

కాగా సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ ను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఐశ్వర్య రాజేష్ నటించబోతుందని సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More