పవన్ – హరీష్ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 3, 2020 12:20 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా రీమేక్ చిత్రమనే పుకారు కూడా ప్రచారంలో ఉంది. ‘గబ్బర్ సింగ్’ హిందీ చిత్రానికి రీమేక్ కావడం, హరీష శంకర్ గత చిత్రం ‘గద్దలకొండ గణేష్’ కూడా తమిళ చిత్రానికి రీమేక్ కాబట్టి పవన్ సినిమా కూడా రీమేక్ అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. కానీ హరీష్ శంకర్ మాత్రం పవన్ కోసం పొలిటికల్ టచ్ ఉన్న ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీయాలని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాల్లో ఒకటి పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొడలుకానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వీలైనంత వరకు 2021 ఆరంభంలోనే చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More