పుష్పలో బన్నీ లోపం అదేనట..!

Published on Aug 25, 2021 2:30 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప”. అయితే సహజంగా సుకుమార్‌కు ఒక అలవాటు ఉంది. తన కథలోని కథానాయకుడికి ఏదో బలమైన లోపం చూపించడం. అలవాటు. ఈ సినిమాలో కూడా సుకుమార్ అల్లు అర్జున్‌కు ఓ లోపాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది.

అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కు సుకుమార్ ఎలాంటి లోపం పెట్టాడో తెలుసుకోవాలని అభిమానులు కూడా దీనిపై ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. అయితే ఫిల్మ్ నగర్ అలికిడి ఏమిటంటే ఈ సినిమాలో బన్నీ కుడు భజం సరిగ్గా పనిచేయదని, దాక్కో దాక్కో మేక పాటలో కూడా బన్నీ ఎడమ భుజంతోనే దర్శనమివ్వడంతో ఇదే నిజమని అంతా అనుకుంటున్నారు. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇకపోతే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :