ఎన్టీఆర్,చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై గురించి ఓ ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా గతంలో బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ ని తీసుకోవాలనుకొని సంప్రదింపులు జరిపారు. కారణాలేమైనా ఆమె మొదట అంగీకరించి, తరువాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అప్పటి నుండి ఎన్టీఆర్ జోడి కొరకు రాజమౌళి వెతుకుతూనే ఉన్నారు. ఐతే తాజా సంచారం ప్రకారం రాజమౌళి ఎట్టకేలకు మరో మారు బ్రిటిష్ నటినే ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే ఆ నటి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం కలదట.
ఇక రామ్ చరణ్ కి షూటింగ్ బ్రేక్ ఇచ్చిన జక్కన్న ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట త్వరలో. వచ్చే ఏడాది జులై 30న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా పూర్తిచేశే పనిలో పడ్డారు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అలియా భట్ చరణ్ సరసన చేస్తుండగా, అజయ్ దేవగణ్, సముద్ర ఖని వంటి ప్రముఖ నటులు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.