ఆకాశాన్ని అంటిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్…!

Published on Aug 14, 2019 10:45 am IST

ఇంకొద్ది రోజులలో ప్రభాస్ భారీ చిత్రం “సాహో” విడుదల ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్,శ్రద్దా కపూర్ కలిసి అనేక టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ చిత్రానికి మరింత హైప్ తెచ్చే పనిలోపడ్డారు. ఐతే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఐతే ప్రాథమిక సమాచారంలో సాహో మూడు వందల కోట్లకు పైగా ప్రీ జరిపిందని సమాచారం.

ఈ మూవీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న టి సిరీస్ హిందీ థియరిటికల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ కలుపొకొని 120కోట్లకు ఒప్పందం చేసుకుందని సమాచారం. ఇక ప్రభాస్ కు అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో కలిపి125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇక తమిళనాడు, కర్ణాటక,కేరళలో కలుపుకొని మొత్తంగా ఇండియా వరకు 291 కోట్ల వరకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. మిగిలిన ఓవర్సీస్ లో 42కోట్ల కు అమ్ముడుబోయిన సాహో ప్రపంచ వ్యాప్తంగా 333కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిందని వినికిడి.

ఇంత పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన సాహో డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టాలంటే కనీసం 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి.ప్రభాస్ బాహుబలి ఇమేజ్ దృష్ట్యా మూవీ ప్రేక్షకులకు నచ్చితే ఇదేమంత టార్గెట్ కాదు. ఐతే ఈ బిజినెస్ లెక్కలు ఎంత వరకు నిజం అనేది వాస్తవిక ప్రకటనలు వస్తే కానీ తెలియదు.

సంబంధిత సమాచారం :