‘సమ్మతమే’లో ట్రాజెడీ ఎండింగ్ అట ?

Published on Feb 1, 2022 9:00 pm IST

యంగ్‌ హీరో కిరణ్‌ అబ‍్బవరం హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘సమ్మతమే’. అర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రానుంది. కాగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ ట్రాజడీ ఎండింగ్ అని, హీరో డెత్ తో సినిమా ముగుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

అన్నట్టు ఈ సినిమా టీమ్ చేసిన మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ జనంలోకి బాగా వెళ్లాయి. శేఖర్‌ చంద్ర ట్యూన్, కృష్ణకాంత్ సాహిత్యం ఈ సినిమాకి బాగా ప్లస్ కానున్నాయట. ఇక సినిమాలో కిరణ్‌, చాందినీ చౌదరీల మధ్య సాగే రొమాంటిక్‌ ట్రాక్‌ కూడా చూడముచ్చటగా ఉంటుందట. యూజీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కె. ప్రవీణ్‌ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :