అజిత్ “వలిమై” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jul 1, 2021 8:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వలిమై”. అజిత్ కెరీర్ లో భారీ యాక్షన్ థ్రిల్లర్ కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే అజిత్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగా ఊరిస్తూ వస్తుంది. మరి దీనిపై ఎప్పటికప్పుడు హడావుడి బాగానే వినిపిస్తున్నా మరోసారి ఇంట్రెస్టింగ్ బజ్ ఈ పోస్టర్ పై తెలుస్తుంది.

వలిమై నుంచి ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గానే కాకుండా అదిరే మోషన్ పోస్టర్ తో మేకర్స్ విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా టాక్. దీనితో అజిత్ అభిమానుల్లో మరింత ఉత్సుకత ఎక్కువ కాగా అలా కనుక వస్తే మళ్ళీ భారీ రికార్డులు అజిత్ సెట్ చెయ్యడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :