అజిత్ “వలిమై” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.?

Published on Aug 26, 2021 5:32 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వలిమై”. భారీ హంగులతో సిద్ధం అవుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ప్రతీ చిన్న విషయాన్ని సాలిడ్ రికార్డుగా అజిత్ అభిమానులు నెలకొల్పుతున్నారు.

మోషన్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్, బుక్ మై షో ఇంట్రెస్ట్స్ వరకు భారీ రికార్డ్స్ ని సెట్ చేసిన అజిత్ ఫ్యాన్స్ కొంత కాలం నుంచి ఈ సినిమా రెండో సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మేకర్స్ కూడా త్వరలోనే హింట్ ఇస్తుండగా ఇప్పుడు దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

తాజా బజ్ ప్రకారం ఈ సాంగ్ వచ్చే ఆగష్టు 31న లాంచ్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :