“దళపతి 67” పై ఇంట్రెస్టింగ్ టాక్.!

“దళపతి 67” పై ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Dec 6, 2022 2:02 PM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి తెలుగులో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం అయితే మన దగ్గర కూడా మంచి అంచనాలు పెట్టుకుంది. ఇక నెక్స్ట్ అయితే ఈ అవైటెడ్ చిత్రం తర్వాత దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో విజయ్ తన కెరీర్ లో 67వ సినిమా చేయనున్నాడు.

ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ తమిళ సినీ వర్గాల నుంచి వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో అయితే స్టార్ హీరోయిన్ త్రిష లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈమె పాత్ర కూడా లోకేష్ కనగ్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం ఒకటి కాగా ఈమె రోల్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈమె హీరోయిన్ గా కనిపిస్తుందా లేక డిల్లీ భార్య పాత్రకి ఈమెకి ఏమన్నా లింక్ ఉందా అని ఇంట్రెస్టింగ్ టాక్ స్టార్ట్ అయ్యింది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు